ఏకగ్రీవంగా పాఠశాల యాజమాన్య ఎన్నికలు

3చూసినవారు
ఏకగ్రీవంగా పాఠశాల యాజమాన్య ఎన్నికలు
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం పిరిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ముచ్చి పార్వతి చైర్‌పర్సన్‌గా, పొందూరు పెద్దులు వైస్ చైర్మన్‌గా, 15 మంది సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయులు డి. మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు ప్రవీణ్, రామకృష్ణ, శివునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్