విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉత్తరాంధ్ర సాధన సమితి ఆగ్రహం

159చూసినవారు
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉత్తరాంధ్ర సాధన సమితి ఆగ్రహం
బొబ్బిలిలో ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకులు వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి, విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై ₹20,000 కోట్ల అదనపు భారం మోపిందని ధ్వజమెత్తారు. APERC సూచనల మేరకు యూనిట్‌కు కేవలం 13 పైసలు తగ్గించి, మళ్లీ యూనిట్‌కు 40 పైసల అదనపు భారం వేయడం మోసపూరితమని మండిపడ్డారు. గత ప్రభుత్వం యూనిట్ ₹2.49 కే ఒప్పందం చేసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థతో యూనిట్ ₹4.60 కు కొనుగోలు చేస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని, ఇది 25 ఏళ్లలో రాష్ట్రంపై ₹14,000 కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్