విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో రెండవ శనివారం, ఆదివారం ఓటరు నమోదు, పేరు, చిరునామా మార్పులు వంటి సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. SIR-2026 కార్యక్రమం జూన్ 15 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా వినతుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఎం. శ్రీను పిరిడి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి BLOలకు ఫారాలు పంపిణీ చేశారు.