బలిజిపేట మండలం బైరిపురం గ్రామంలో శనివారం బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్లోబ్ చుట్టూ ధ్యానం చేసి, సానుకూల ఆలోచనలతో పర్యావరణాన్ని కాపాడేందుకు సంకల్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.