MPDO కార్యాలయంలోకి నీరు.. చర్యలు తీసుకున్న కమిషనర్

860చూసినవారు
MPDO కార్యాలయంలోకి నీరు.. చర్యలు తీసుకున్న కమిషనర్
బొబ్బిలిలో గురువారం కురిసిన భారీ వర్షానికి MPDO కార్యాలయంలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరి విధులకు కొంత అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది వెంటనే డ్రైన్లను శుభ్రం చేసి నీటిని బయటకు పంపించారు. దీంతో శుక్రవారం ఉదయానికి కార్యాలయ ప్రాంగణం, రహదారి పూర్తిగా శుభ్రంగా మారాయి. అధికారులు యథావిధిగా విధులు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్