భూ వివాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

337చూసినవారు
భూ వివాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి జిల్లాను వివాదరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. బొబ్బిలి కళాభారతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది పారదర్శకంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో నేరుగా పరిశీలనలు చేసి ఖచ్చితమైన వివరాలతోనే పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని, ఫిబ్రవరి 10లోగా అన్ని తప్పులు సరిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్