జీతాలు పెంచమంటే తొలగిస్తారా ?

1149చూసినవారు
గ్రోత్ సెంటర్ ఏపీఐఐసీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 9 మంది కార్మికులను అక్రమంగా తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, వారాంతపు సెలవులు కల్పించాలని కార్మికులు కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు, నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్