చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ అధ్యక్షుడు, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, అలజంగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి అభిమాన కార్యకర్త బవిరి కిషోర్ కుమార్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యకర్తలే పార్టీకి అండదండ అని, వారి మంచి చెడ్డలు చూసుకోవడం నాయకుల కనీస ధర్మమని అన్నారు. కార్యకర్త బాగుంటేనే నాయకుడు బాగుంటాడని ఆయన పేర్కొన్నారు.