మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన

4చూసినవారు
మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
గుర్ల మండలం దామరసింగి గ్రామంలో బుధవారం ఎస్సై నారాయణరావు గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్