చీపురుపల్లి: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి

76చూసినవారు
చీపురుపల్లి: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి
బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన చీపురుపల్లి మండలంలో చోటు చేసుకుంది. రేగిడి పేటకు చెందిన దన్నాన శ్రీనివాసరావు (35) బుధవారం రాత్రి తన బైక్ పై గరివిడి నుండి చీపురుపల్లి వస్తున్న నేపథ్యంలో ఆంజనేయపురం గ్రామ సమీపంలో వెనుక నుండి ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.