రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో అక్రమాలు: రైతుల ఆరోపణలు

103చూసినవారు
రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో అక్రమాలు: రైతుల ఆరోపణలు
గుర్ల మండలం నడుపూరు రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ సమయంలో MRP ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేసి, రైతులకు బిల్లులు ఇవ్వకుండా పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సిఫార్సు ఉన్న నాయకులకు 50 బస్తాల చొప్పున పంపిణీ చేయగా, అసలైన రైతులకు ఒక్క బస్తా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. వృద్ధ రైతులు మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడ్డారు. యూరియాతో పాటు ఇతర సరుకులు కొనుగోలు చేయాలని రైతులను బలవంతం చేస్తూ, అధిక ధరలకు బిల్లులు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్