చీపురుపల్లి మండలం అలజంగి గ్రామ సచివాలయంలో బుధవారం యూరియా పంపిణీ సందర్భంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రశాంత్ నాయకులకు అడ్డగోలుగా యూరియాను తరలించడంపై రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన రైతులకు యూరియా ఇవ్వకుండా నాయకులకు తరలించారని, స్టోర్లో యూరియా ఉన్నా అయిపోయిందని చెప్పారని రైతులు ఆగ్రహించారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం రైతులకు తగినంత యూరియా నిల్వలు ఉంచాలని రైతులు కోరారు.