వెదుళ్ళ వలస క్రీడాకారులకు మై భారత్ కిట్లు అందజేత

789చూసినవారు
వెదుళ్ళ వలస క్రీడాకారులకు మై భారత్ కిట్లు అందజేత
గరివిడి మండలం వెదుళ్ళ వలస గ్రామ క్రీడాకారులకు భారత ప్రభుత్వ క్రీడ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కింద క్రీడా కిట్లు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా యువతకు వాలీబాల్, త్రో బాల్, ఫుట్బాల్ కిట్లు పంపిణీ చేశారు. యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కిట్లు అందించినట్లు చీపురుపల్లి నియోజకవర్గం బిజెపి కో కన్వీనర్ మన్నెపురి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ ఎం సూర్యనారాయణ తెలిపారు. ఈ పంపిణీతో యువత ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్