ఖైదీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు

504చూసినవారు
ఖైదీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఖైదీల పట్ల వివక్షతను నివారించడానికి మంగళవారం ప్రభుత్వ బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్ ను ఏర్పాటు చేశారు. నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో చీపురుపల్లి సబ్ జైల్‌ను సందర్శించి, ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు తీర్పును వారికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్