లైన్ మెయింటెనెన్స్ పనులతో... నేడు విద్యుత్ అంతరాయం

545చూసినవారు
లైన్ మెయింటెనెన్స్ పనులతో... నేడు విద్యుత్ అంతరాయం
మెరకముడిదాం మండలంలోని సోమలింగాపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఊటపల్లి ఫీడర్, గర్భాం సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ భైరిపురం ఫీడర్‌లో లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్కో ఏఈ పెద్దంటి త్రినాథ రావు తెలిపారు. ఈ అంతరాయం ఊటపల్లి, శ్యామాయలవలస, కొమ్మానివలస, గాదెలమర్రివలస, బడ్నాయివలస, శివందొరవలస, ఎం. పాలెం, ఎం. రావివలస, రాయవలస, అలాగే భైరిపురం ఫీడర్ పరిధిలోని బుదరాయవలస, కొత్తకర్ర, కొర్లాం, సిరియాలపేట, కుంచుగుమడాం, బిల్లలవలస, నరసయ్యపేట, గొట్టిపల్లి గ్రామాల్లో ప్రభావం చూపనుంది.

సంబంధిత పోస్ట్