విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణల
ో ఉన్న అన్న క్యాంటీన్‌లో సోమవారం భోజనాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకే భోజనాలు అయిపోయాయని సిబ్బంది తెలిపారు. 450 మందికి భోజనాలు పంపించాల్సి ఉండగా, కేవలం 300 మాత్రమే పంపించారని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో క్యాంటీన్ ముందు బారులు తీరిన లబ్ధిదారులు, అరకొరగా భోజనాలు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.