విజయనగరం, చీపురుపల్లిలోని గరివిడి మండలం వి. పి. రేగ గ్రామాన్ని ఎస్‌ఐ లోకేశ్వర్ రావు ఆదివారం సందర్శించారు. గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించి, దొంగతనాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, పోక్సో చట్టం వంటి అంశాలపై వివరించారు. గ్రామంలో జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.