కార్యకర్తలే భవిష్యత్ నాయకులు.. వలిరెడ్డి శ్రీనివాసనాయుడు

244చూసినవారు
కార్యకర్తలే భవిష్యత్ నాయకులు.. వలిరెడ్డి శ్రీనివాసనాయుడు
చీపురుపల్లి మండలం, దేవరపోదిలాం పంచాయతీలో 'మన కుటుంబం - మన కార్యకర్త' కార్యక్రమంలో జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, అధికారంలో లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవాలని, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలతో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమర్థవంతమైన కార్యకర్తలే భవిష్యత్ నాయకులని, వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో సంక్షేమ పాలన లేదని, రెడ్ బుక్ పాలన జరుగుతోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్