ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో సామాన్యుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె పేర్కొన్నారు. వంట నూనె డబ్బా ధర 400 నుంచి 500 రూపాయలు పెరిగిందని, 25 కేజీల బియ్యం బస్తాపై 150 రూపాయలు పెరిగిందని తెలిపారు. కారం, ధనియాలు, కందిపప్పు, వేరుశెనగలు, మినపప్పు వంటి అన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరుగుతోందని, వంట గ్యాస్‌పై కూడా 60 రూపాయలు పెంచారని ఆమె అన్నారు. విజయనగరం, చీపురుపల్లిలో ఈ వ్యాఖ్యలు చేశారు.