చీపురుపల్లి మండలం, నిమ్మలవలసలో జరిగిన 'మన కుటుంబం - మన కార్యకర్త' కార్యక్రమంలో యువనాయకురాలు డాక్టర్ బొత్స అనూష కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కు అని, వారికి సమచిత స్థానం దక్కేలా వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.