నేడు ఆ ప్రాంతం లో విద్యుత్ సరఫరా అంతరాయం

78చూసినవారు
నేడు ఆ ప్రాంతం లో విద్యుత్ సరఫరా అంతరాయం
గరివిడి సబ్ స్టేషన్ నుంచి రాజాం ఫీడర్‌లో చెట్ల తొలగింపు పనులు చేపట్టడం వల్ల శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు ఈపీడీసీఎల్ విజయనగరం పట్టణ డీఈ పి. త్రినాథరావు తెలిపారు. గచ్చలవస, పుర్రేయవలస, పీకే పాలవలస సబ్ స్టేషన్ల పరిధిలో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్