అకాల వర్షం.. ఉపశమనం... రైతుల్లో ఆందోళన

353చూసినవారు
విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరు గ్రామంలో శుక్రవారం ఆకస్మికంగా వాతావరణం మారి వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినా, ఈ వర్షం రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. ముఖ్యంగా మామిడి పంటకు నష్టం వాటిల్లే అవకాశముండగా, మొక్కజొన్న పంటలు తడిసిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేస్తున్న వారు చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్