విశాఖపట్నంలో జరుగుతున్న వైస్సార్ పార్టీ ప్రచార విభాగం (పబ్లిసిటీ వింగ్) ఆత్మీయ సమావేశానికి విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చీపురుపల్లి నుండి బయలుదేరి శనివారం వెళ్లారు. ఈ సమావేశం పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు ఉద్దేశించబడింది. జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలోపాల్గొన్నారు.