రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

86చూసినవారు
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
రాజాంలో రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ వంటి రెవెన్యూ శాఖ విధులకు సంబంధించి కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, ఇతర సిబ్బందితో సమావేశమై, రీ సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, పాస్ పుస్తకాలలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూడాలని, జాయింట్ ఎల్పీఎంలను సరిచేయాలని దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్