
పంచాయతీ కార్మికులు సమ్మెకు సిద్ధం, నోటీసు అందజేత
ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో పురిటిపెంట గజపతినగరం పంచాయతీ కార్మికులు కూడా పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం పురిటిపెంట సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి, కనకరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం మండలంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.








































