గజపతినగరంలో ఇటీవల ప్రమాద బీమా పాలసీ తీసుకుని మరణించిన వ్యక్తి కుటుంబానికి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) రూ.15 లక్షల బీమా చెక్కును అందజేసింది. IPPB తొమ్మిదవ పౌండేషన్ డే సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసు మాట్లాడుతూ, ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా పాలసీ తీసుకోవాలని ఆయన సూచించారు.