గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య బుధవారం దత్తిరాజేరు మండలంలోని దత్తిరాజేరు గ్రామంలో జరిగిన అనుబంధ గ్రామ కమిటీ సదస్సులో మాట్లాడుతూ, అనుబంధ సంఘాల కమిటీలను తక్షణమే పూర్తి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రి నాయుడు, జడ్పిటిసి రౌతు రాజేశ్వరి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.