మెంటాడ మండలం చల్లపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సర్వ లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై అవగాహన కల్పించారు.