విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం గ్రామంలో శనివారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా నడిగంటి అప్పలనాయుడు, వైస్ చైర్మన్గా పొట్నూరు ప్రశాంతిలు ఎన్నికయ్యారు. టిడిపి తరఫున 15కి 13 మంది సభ్యులు విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన వారిని పలువురు అభినందించారు.