గజపతినగరానికి చెందిన సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, విశాఖపట్నంలో జరిగిన శంకర్ ఫౌండేషన్ ఫౌండర్స్ డే కార్యక్రమంలో ఉత్తమ సేవలందించినందుకు అవార్డును అందుకుంది. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్ చేతుల మీదుగా మేనేజింగ్ ట్రష్టి కృష్ణ కుమార్ జ్ఞాపికను అందజేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 13 నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, 367 మందికి శస్త్ర చికిత్సలు చేయించినందుకు ఈ సత్కారం లభించింది.