రైతులకు మెరుగైన సేవలు అందించండి.. డీసీసీబీ చైర్మన్

243చూసినవారు
రైతులకు మెరుగైన సేవలు అందించండి.. డీసీసీబీ చైర్మన్
గజపతినగరం పరిధిలోని గంట్యాడ మండలంలో పెంట శ్రీరాంపురం, బోనంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS) మరియు గోదాంలను డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున గురువారం సందర్శించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్థిక లావాదేవీలు, ధాన్యం కొనుగోలు విధానం, నిల్వ సదుపాయాలపై ఆయన ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్