గజపతినగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని చెబుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.