మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట గ్రామంలో బుధవారం తల్లి పాల వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మెంటాడ సెక్టార్ సూపర్వైజర్ కె. రాధిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తల్లిపాల ప్రాముఖ్యతను, బిడ్డకు అవి అమృతం వంటివని వివరించారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు, రెండు సంవత్సరాల వరకు కొనసాగించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విమల కుమారి, డాక్టర్ కల్పన, పంచాయతీ సెక్రెటరీ, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.