గజపతినగరంలో 14 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

75చూసినవారు
గజపతినగరంలో 14 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 14 మంది లబ్ధిదారులకు మొత్తం 20 లక్షల 953 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గంట్యాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్, కొండపల్లి భాస్కరనాయుడు, గోపాలరాజు, బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయం గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం మండలం పరిధిలోని లబ్ధిదారులకు అందించబడింది.

సంబంధిత పోస్ట్