గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆదివారం గజపతినగరంలో మాట్లాడుతూ, నీచ సంస్కృతికి అలవాటు పడిన అంబటి రాంబాబు దైవం లాంటి చంద్రబాబును దూషించడం దారుణమని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల కృషితో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సమ్మిట్‌ల ద్వారా పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బండారు బాలాజీ, వేమలి చైతన్య బాబు తదితరులు పాల్గొన్నారు.