గజపతినగరంలోని వెలుగు సమాఖ్య ఆఫీసును వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయం సహాయక సంఘాల పొదుపులు, అప్పుల నిల్వలను ఎలా అప్డేట్ చేస్తున్నారో ఏపీఎం నారాయణరావుతో కలిసి వివో ఏ ఎస్ లతో చర్చించారు. సమస్యలుంటే సిసి, ఎల్ సి రామకృష్ణతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.