గజపతినగరంలో ముమ్మరంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ

3చూసినవారు
గజపతినగరంలో ముమ్మరంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ
విజయనగరం జిల్లా గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల విధుల కోసం సుమారు 300 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికల్లో భాగంగా సుమారు 45 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్