మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

722చూసినవారు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని రామన్నపేట గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, సర్పంచ్ అరుణకుమారి, టిడిపి నేతలు మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్