పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి శ్రీనివాస్

962చూసినవారు
పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి శ్రీనివాస్
ఆదివారం గజపతినగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు చుక్కల మందు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్