గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెంటాడ మండలం మీసాల పేట గ్రామానికి చెందిన గంట్యాడ రోహిత్ కుమార్ (21) మృతి చెందారు. రోహిత్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నిలిపి ఉంచిన వ్యానును వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రోహిత్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరణించినట్లు సమాచారం. ఈ విషాదకర సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.