విజయనగరం జిల్లా, బొండపల్లి మండలంలోని గరుడబిల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన శివాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నం నాయుడు, పలువురు వైసిపి నాయకులు కూడా పాల్గొన్నారు.