కోడూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం: 29 మందికి క్యాటరాక్ట్ సర్జరీకి ఎంపిక

375చూసినవారు
కోడూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం: 29 మందికి క్యాటరాక్ట్ సర్జరీకి ఎంపిక
బాడంగి మండలం కోడూరు రామాలయం వద్ద బుధవారం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ఆప్తమాలజిస్ట్ జాక్సన్ 57 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 29 మందిని క్యాటరాక్ట్ సర్జరీకి ఎంపిక చేశారు. వీరందరికీ శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో బస్సు ద్వారా తీసుకెళ్లి సర్జరీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్, కార్యదర్శి సాయి, ఫౌండేషన్ సభ్యులు వాసు, సతీష్, క్యాంప్ కోఆర్డినేటర్ జోగారావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్