గజపతినగరంలో ఉచిత వైద్య శిబిరం

1చూసినవారు
గజపతినగరం పిఎసిఎస్ ఆవరణలో బుధవారం స్వర్ణిమ సహకార వారోత్సవాల సందర్భంగా సొసైటీ సీఈఓ డి నారాయణరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి ప్రారంభించారు. సుమారు 50 మంది రోగులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. రోగులను మరుపల్లి పీ. హెచ్. సి వైద్యాధికారి డాక్టర్ తనూజ్ రాయ్ పరీక్షించారు. ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, సొసైటీ అధ్యక్షుడు లెంక బంగారునాయుడు, జిల్లా సహకార అధికారి రమేష్, డివిజనల్ అధికారి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్