విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం పురిటిపెంట గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామ అభివృద్ధి అధికారి జగదీష్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సురేష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.