దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 15 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం జరిగిన ఈ నిమజ్జనంలో మహిళల కోలాటం ఆకట్టుకుంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.