విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం బొండపల్లిలోని నెలివాడ అంకన్న చెరువు వద్ద ఆదివారం 'యోగాంధ్ర -2026' ఉత్సవాల్లో భాగంగా యోగాసనాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార సిబ్బంది, సచివాలయ సిబ్బంది, యోగా శిక్షకులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.