స్వచ్ఛ గ్రామాల కోసం సమన్వయంతో పని చేద్దాం.. ఎంపీడీవో కళ్యాణి

4చూసినవారు
విజయనగరం, గజపతినగరం మండలంలోని పురిటిపెంట కాలనీలో స్వచ్ఛ గ్రామాల కోసం ప్రజలు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీవో కళ్యాణి అన్నారు. బుధవారం అధిక పొడి చెత్తను ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం జగదీష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీదేవి, గోపాల రాజు, కిరణ్ కుమార్, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్