శుక్రవారం ఉదయం నుంచే జామి RSK-2 వద్ద రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. పోలీసుల పహారా మధ్య వ్యవసాయ అధికారులు ఒక్కొక్క రైతుకు ఒక యూరియా బస్తాను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని, సమయానికి యూరియా అందక పంట నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.