గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి చెందిన లెంక రామునాయుడు మనస్థాపంతో పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్. ఐ కె. కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తల్లి ఇటీవల అనారోగ్యానికి గురైతే ఆమెను పట్టించుకోకుండా రామునాయుడు ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య సన్యాసమ్మ మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రాము నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.