చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

1127చూసినవారు
చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన కొలుసు అప్పలరాజు చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు భార్య గౌరీ సోమవారం తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అప్పలరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్